Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్థలానికి ఎసరు..!
- వెంచర్ చేసి ఫిన్సింగ్ చుట్టి స్వాహాకు యత్నం
- కబ్జాదారులపై చట్ట పరమైన చర్యలకు అధికారులు వెనకంజ
నవతెలంగాణ-నర్సంపేట
నర్సంపేట పట్టణంలోని ప్రధాన రహదారుల పక్కన ఉన్న అతి విలువైన ప్రభుత్వ భూములను కాజేసేందుకు రియాల్టర్లు పావులు కదిపారు..అధికార, ప్రతిపక్ష పార్టీల ముసుగులో నాయకులుగా చెలామణి అవుతున్నా కొందరి బరిదెగింపు పేదలకు శాపంగా మారింది. పట్టపగలే ప్రభుత్వ స్థలాలను కొల్ల గొడుతున్నారు. కాకతీయ నగర్ సమీపంలోని నెక్కొండ ప్రధాన రహదారి పక్కన సర్వే నెంబర్ 601/1 సర్వే నంబర్లోని 1.39 ఎకరాల విస్తీర్ణం కలిగిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కేటాయించిన ప్రభుత్వ స్థలానికే ఏకంగా ఎసరెట్టేశారు. ఓపెన్ మార్కెట్లో కోట్ల విలువజేసే ప్రభుత్వ స్థలంలో వెంచర్ చేసి చుట్టూ ఫిన్సింగ్తో యధేచ్ఛగా కొల్లగొట్టే యత్నానికి పాల్పడ్డారు. పేదలు తలదాచు కొనేందుకు గుడిసెలు వేసుకొంటే మాత్రం పోలీసు బలగాలతో చేరుకొని లాఠీలకు పని చెబుతారు. అమాయకులపై కేసులు పెట్టి మరీ జైల్‌కు పంపించిన ఉధాంతాలు ఉన్నాయి. అడ్డదారిలో ఆక్రమించిన వారిపై మాత్రం నామమాత్ర చర్యలతో సరిపెట్టుకొని తిరుగుముఖం పట్టడం అధికారులకు అనవాయితీగా మారిందని పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు. కబ్జాదారులపై చట్ట పరమైన చర్యలకు స్వస్తి పలు కడం వల్ల ఆక్రమణల పర్వం ఎప్పటి కప్పుడు పునరావృతమౌవుతునే ఉన్నాయి.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకే కేటాయించిన కోట్ల భూమి కొల్లగొట్టే యత్నం..
కాకతీయ నగర్ పక్కన నెక్కొండ రోడ్డు సర్వే నెంబర్ 601/1లో 1.39 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్రభుత్వ భూమిని 2016 సెప్టెంబర్ 9న అప్పటి తహసీల్దార్ ఉమారాణి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకానికి కేటాస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణానికి 689 ఇండ్లు మంజూ రయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ప్రభుత్వ స్థలాలను కేటాయించాలని తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసింది.ఈ క్రమంలో కాకతీయ నగర్‌లోని ఈ స్థలంతో పాటు మహబూబాబాద్ రోడ్డులోని రద్దు చేసిన పెట్రోల్ బంకు వెనుక భాగంలోని సర్వే నెంబర్ 121లోని 1.06 ఎకరాలను తహసీల్దార్ కేటాయించారు. ఈ రెండు ప్రాంతాల ప్రభుత్వ స్థలాలు కోట్ల విలువజేయనున్నాయి. అతి విలువైన ఈ భూములపై కన్నేసిన కొందరి లాబీలు చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కేటాయి ంచకుండా అడ్డుపడ్డారు. ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజు కోవడంతో ఇదే అదునుగా వెంచర్ చేసి ప్లాట్లు అమ్ముకొనేందుకు పావులు కదిపారు. ఏకంగా ఫిన్సింగ్ చేసి కబ్జా చేయడం పలు వురిని నివ్వెరపర్చింది. సమాచారం మేరకు రెవెన్యూ అధికారుల బృందం సందర్శించి ఫిన్సింగ్, రాళ్లను తొలగించే చర్యలు చేప ట్టారు. ఈ యధేచ్ఛ ఆక్రమణపై రెవెన్యూ అధికారులు చట్ట పరమైన చర్యలకు మాత్రం పూనుకోకపోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఆక్రమణదారులపై చర్యలు తీసుకొని పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి
- హన్మకొండ శ్రీధర్, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి
ప్రభుత్వ భూములను ఆక్రమించుకొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పట్టణంలో పేదలు నివాసం ఉండేందుకు జానెడు జాగ లేక అద్దె ఇండ్లల్లో తీవ్ర ఇక్కట్లకు పాలవుతున్నారు. ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేపట్టాం. అధికారులు హామీలతో సరిపెటుకుంటున్నారనేగానీ ఇచ్చింది లేదు. ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలు వేల సంఖ్యలో ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు ఎక్కడిక్కడా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైతున్నా రెవిన్యూ అధికారులు పట్టి పట్టన్నట్లు వ్యవహరించడం సరైందికాదు. రియాల్టర్లు ఆక్రమిం చుకుంటే తక్షణమే స్పందించడం లేదు. శాశ్వతమైన చట్టపరమైన చర్యలు చేపట్టడం లేదు.పేదలు గుడిసెలు వేస్తే మాత్రం ఉన్నఫలంగా వచ్చి భయాబ్రాంతులకు గురిచేయడం ఎంతవరకు సమంజసం.అనేక పోరాటాల ఫలితంగా కొందరికి రెగ్యూలరైజ్ పట్టాలు జారీ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్థలాలను రక్షించే చర్యలు చేపట్టి పేదల ఇండ్ల స్థలాలకు అప్ప గించాలి. లేనిపక్ష్యంలో గుడిసెలు వేయించి కాపాడుకోవల్సి వస్తుంది.