Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న ఉప్పెన సినిమా హీరో, హీరోయిన్
నవతెలంగాణ-ఖమ్మం
వస్త్ర రంగంలో వినూత్న మార్పులతో మార్కెట్లో దూసుకుపోతున్న కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ 18వ స్టోర్‌ను ఈ నెల 3న ప్రారంభిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ కళామందిర్ కళ్యాణ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం నగరంలోని కస్బా బజార్ లో ఉదయం 11 గంటలకు ఉప్పెన ఫేమ్ హీరోయిన్ కృతి శెట్టి, హీరో వైష్ణవ్ తేజ్ లు ప్రారంభిస్తారని తెలిపారు. కె.ఎల్.ఎమ్ ఫ్యాషన్ మాల్ కంప్లీట్ ఫ్యామిలీ షోరూం అని కుటుంబ సమేతంగా వస్త్ర ప్రేమికులు షాపింగ్ చేసేలా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వస్త్ర ప్రేమికులు ఆదరాభిమానాలు చూరగొన్న కె.ఎల్.ఎమ్ ఫ్యాషన్ మాల్ ఖమ్మంలో కూడా సరికొత్త డిజైన్లతో అందరికీ అందుబాటు ధరల్లో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని ఖమ్మం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.