Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-న్యూ శాయంపేట
వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలలో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించిన మట్టెవాడ విజరుకుమార్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం వరంగల్ కోర్టు ప్రాంగణంలో జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు జరగగా అదేరోజు పొద్దుపోయాక నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించిన మట్టెవాడ విజరు కుమార్‌ను బార్ కౌన్సిల్ హాల్లో పలువురు న్యాయవాదులు, శ్రేయోభి లాషులు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. కాకతీయ విశ్వవిద్యాలయం ఉద్యోగి, టెంపరరీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్, మైక్రో ఆర్టిస్ట్ అజరు లు పుష్ప గుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. విశ్వ బ్రాహ్మణులు గర్వించేలా బార్ అసోసియేషన్‌కు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని విష్ణువర్ధన్, అజరు ఆశాభావం వ్యక్తం చేశారు.