Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖిలా వరంగల్
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంతోపాటు డివిజన్ కేంద్రం ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని సీపీఐ(ఎం) ఐనవోలు మండల కార్యదర్శి కాడ బోయిన లింగయ్య డిమాండ్ చేశారు. గురువారం మండల కమిటీ ఆధ్వర్యంలో కాజీపేట జంక్షన్ సాధన సమితి కరపత్రాలను అయినవోలులోని తెలంగాణ సెంటర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ కేంద్రానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నా అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. విభజన చట్టంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం నేటి వరకు ఏర్పాటు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. వెంటనే కాజీపేట ను డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యాకయ్య, రవిబాబు, మహేందర్, నరసయ్య పాల్గొన్నారు