Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాక్ డౌన్ ప్రకటించిన అధికారులు
నవతెలంగాణ-మహదేవపూర్
మహాదేవపూర్ మండలం ఎడపల్లి గ్రామంలో ఇప్పటి వరకు సర్పంచ్‌తో సహా 277మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా 35మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని అంబటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి రామారావు తెలిపారు. గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 22న మహాదేవపూర్ పాఠశాలలో విద్యార్థులకు కరోనా పరీక్ష నిర్వహించగా ఓ బాలికకు పాజిటివ్ వచ్చింది మరుసటి రోజు ఇదే గ్రామంలో పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ, మరో రోజు ఐదుగురికి ఇలా ఒకటవ తేదీ వరకు 277 మందికి పరీక్ష నిర్వహించగా సర్పంచ్‌తో సహా 35 మందికి పాజిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. గ్రామంలో చిరుతల రామాయణం సాంస్కతిక కార్యక్రమం జరగడంతో మహారాష్ట్ర నుండి వారి బంధువులు, ఇతర ప్రాంతాల నుండి వారు రావడం, కరోనా నిబంధనలు పాటించకపోవడంతో కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామానికి ఎవరు రావొద్దని, ఇక్కడివారు బయటకు వెళ్లొద్దని లాక్డౌన్ ప్రకటించి గ్రామంలో చుట్టూ ముళ్ల కంచె వేయించినట్టు తెలిపారు. పోలిస్, గ్రామపంచాయతీ, అధికారులు, ఆరోగ్య శాఖ ద్వారా అన్ని చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సహకరిస్తున్నారని అన్నారు. గురువారం 19 మందికి కోవిద్ పరీక్షలు చేసినట్టు తెలిపారు.