Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
కుటుంబాన్ని తండ్రి పట్టించుకోకపోవడంతో ఇద్దరు చెల్లెల్ల వివాహం జరిపించగా వివాహ ఖర్చులకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మదనపడుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగి పురుగుల మందు తాడి చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మండలంలోని కొప్పుల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై అక్కినపల్లి ప్రవీణ్‌కుమార్ కథనం ప్రకారం... కొప్పుల గ్రామానికి చెందిన యేరుకొండ రాయమల్లు- కొమురక్క దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు దిలీప్ (28) చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కరోనా ఎఫెక్ట్ తో ఇంట్లో ఉండి విధులు నిర్వర్తిస్తున్నాడు. అప్పులు తెచ్చి ఇద్దరు సోదరీమణుల వివాహాలు జరిపించాడు. మూడు నెలల క్రితం దిలీప్‌కు వివాహం జరిగింది. చెల్లెల్ల పెళ్ళికి తెచ్చిన అప్పులు తీర్చలేక పోతున్నానని తల్లి, భార్య వద్ద తరచూ మదన పడుతూ ఉండేవాడు . వారు ధైర్యం చెప్పిన ఆలోచనలు మానుకోలేదు. ఈ క్రమంలో మార్చి 30 రాత్రి 11 గంటల 30 నిమిషాలకు బైక్ పై ఇంటికి వచ్చి తాను పురుగుల మందు సేవించానని, తనను కాపాడాలని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో పొరుగున ఉన్న ఏరుకొండ నాగరాజు, పన్నాటి మధు కుటుంబ సభ్యుల సహాయంతో పరకాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్య చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గత నెల 31న హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం దిలీప్ మృతిచెందాడు. మృతుడి తల్లి కొమురక్క ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.