Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు మదార్
- కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-మహబూబాబాద్
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు మదార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక వర్గ హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను సవరిస్తూ నాలుగు కోడ్లుగా విభజించడాన్ని నిరసిస్తూకార్మిక శాఖ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వమించారు. అనంతరం సహాయ కార్మిక శాఖ అధికారి రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ నాయకుడు మదార్ మాట్లాడారు. సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు శివారపు శ్రీధర్, కట్య్రాల కష్ణ, గద్ద రమేష్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.