Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
ప్రజాపోరాటాలే ఊపిరిగా జీవితాన్ని త్యాగం చేసిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు ఐతపు మంగపతిరావు జనం గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచారని ఆ పార్టీ సీనియర్ నాయకులు కందునూరి ఈశ్వర్లింగం, జిల్లా నాయకులు కందునూరి శ్రీనివాస్ అన్న్నారు. స్థానిక మంగపతిరావు భవన్లో మంగపతిరావు 19వ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల కార్యదర్శి గిరిప్రసాద్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిధులుగా ఈశ్వర్లింగం, శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన మంగపతిరావు తెలంగాణ సాయుధ పోరాటంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా గార్ల మండలంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో పాల్గొని అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎనలేని కషి చేశారని కొనియాడారు. తొలుత మంగపతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్లు మహేశ్వర్రావు, ఎల్లయ్య, అంబటి వీరస్వామి, హరి, అల్వాల రామకృష్ణ, శ్రీను, వీరభద్రం, మల్లయ్య, వీపీ వెంకటేశ్వర్లు, కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.