Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్డీఓ సమక్షంలో తీర్మాణం
- అడ్డుకున్న గ్రామస్తులు, పోలీసుల రంగప్రవేశం
నవతెలంగాణ-తొర్రూరు
మండలంలోని వెలికట్ట గ్రామపంచాయతీ ఉపసర్పంచ్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. తొర్రూరు ఇన్చార్జి ఆర్డీఓ కొమురయ్య అధ్యక్షతన గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ దీకొండ సంధ్య గ్రామ అభివద్ధికి సహకరించడం లేదని, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు సభ్యులు తెలిపారు. సంధ్యపై అవిశ్వాస తీర్మానం పెట్టొద్దని కొందరు గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు గ్రూపులను శాంతింపజేశారు. నూతన ఉప సర్పంచ్‌ను ఎన్నుకోవడానికి తదుపరి సమావేశం ఏర్పాటు చేస్తామని ఆర్డీవో కొమరయ్య తెలిపారు. గ్రామపంచాయతీలో మొత్తం 10 మంది వార్డు సభ్యులు ఉండగా 8 మంది అవిశ్వాస తీర్మానంపై సంతకం చేశారు. దీంతో సంధ్యను తొలగిస్తున్నట్టు ఆర్డీఓ ప్రకటించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దష్టికి తీసుకెళ్తామని, మళ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు తేదీ ప్రకటిస్తామని ఆర్డీఓ తెలిపారు.