Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కురవి
బాల్యవివాహాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ సూచించారు. మండల కేంద్రంలోని ఫంక్షన్ హాలులో 89 మంది లబ్దిదారులకు ఆయన గురు వారం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. బాల్యవివాహాలు చేస్తే కల్యాణలక్ష్మీ వర్తించదని చెప్పారు. మైనర్లకు వివాహం చేయడం నేరమన్నారు. ఆడ పిల్లలకు 18, మగ పిల్లలకు 21 ఏండ్లు వచ్చాకే వివాహం చేయాలని స్పష్టం చేశారు. మైనర్లకు వివాహం జరిపిస్తే శారీరక, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ గుగులోత్ పద్మావతి రవినాయక్, మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మెన్ బజ్జూరి ఉమ పిచ్చిరెడ్డి, మరిపెడ డివిజన్ ఆత్మ చైర్మెన్ తోట లాలయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, డోర్నకల్ ఎంపీపీ బాలునాయక్, జెడ్పీటీసీ పొడిశెట్టి కమల రామనాధం, టీఆర్ఎస్ పార్టీ డోర్నకల్ మండల అధ్యక్షుడు రమణ, పీఏసీఎస్ చైర్మెన్లు దొడ్డ గోవర్ధన్‌రెడ్డి, గార్లపాటి వెంకట్‌రెడ్డి, విద్యాసాగర్, ఆలయ చైర్మెన్ బాధావత్ రామునాయక్, బాధావత్ రాజునాయక్, వైస్ ఎంపీపీ దొంగలి నర్సయ్య, చిన్నం భాస్కర్, నూతక్కి నర్సింహారావు, బానోత్ రమేష్, బెడద వీరన్న, బానోత్ తుకారాం నాయక్, తదితరులు పాల్గొన్నారు.