Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ఎదునూరి వెంకట్రాజం
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
ఉద్యోగాల కల్పనలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని డీవైఎఫ్ఐ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు ఎదునూరి వెంకట్రాజం తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర సర్వీస్ కమిషన్కు 13.5 లక్షల మంది నిరుద్యోగులు నమోదు చేసుకోగా, ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యమే రాజ్యమేలిందని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం హామీలిస్తూ తదనంతరం విస్మరిస్తోందని విమర్శించారు. ప్రజాసంఘాల జిల్లా నాయకుడు మునిగెల రమేష్ మాట్లాడుతూ పాలకులు యువతను మతం మత్తులోకి దింపే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వెలిబుచ్చారు. సంప్రదాయం పేరుతో అశాస్త్రీయమైన ఆలోచనలు చొప్పించి యువతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం డీవైఎఫ్ఐ మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పండుగ రాజు (తాటికొండ), ప్రధాన కార్యదర్శిగా శాతపురం రవి (ఇప్పగూడెం), ఉపాధ్యక్షులుగా పగిడిపల్లి మల్లేష్ (అక్కపెల్లిగూడెం), సహాయ కార్యదర్శులుగా పర్ష రాజు (కోమటిగూడెం), కత్తుల రత్నాకర్ (ఇప్పగూడెం), కోశాధికారిగా అన్నెపు అనిల్ (ఇప్పగూడెం), సభ్యులుగా కత్తుల రాజు (సముద్రాల), లావుడ్య సతీష్ (జిట్టెగూడెం), పల్లెపు రాకేష్, కొన్నె అరవింద్, యార సందీప్, తాటికొండ నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో కేవీపీఎస్ మండల కార్యదర్శి మంద మహేందర్, నాయకులు దైద అనిల్, సామ నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.