Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్తది కొట్టం.. పాతది వదలం..
- కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి
నవతెలంగాణ-ములుగు
పోడు రైతులపై అటవీ శాఖ అధికారుల దాడులు ఆపాలని కాం గ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి డిమాండ్ చేశారు. కొత పోడు కొట్టబోమని, పాత పాడును వదలబోమని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు చాంద్ పాషా అధ్యక్షతన గురువారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి కుమారస్వామి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రెండ్రోజులుగా జిల్లాలో పోడురైతులపై అటవీ శాఖ అధికారులు దాడులు చేస్తూ రైతు లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. బుధవారం కన్నాయిగూడెం, ములుగు మండలాల్లో దాడులు చేసి ట్రెంచ్ పనులు చేపట్టారని చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో పోడు భూములకు పట్టాలిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడచినా ఇప్పటివరకు పట్టాలివ్వకపోగా హరితహారం పేరుతో భూములను లాక్కునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్యే సీతక్క పోడు భూములకు పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని నిలదీస్తే సంబంధిత మంత్రి సత్యవతి రాథోడ్ భర్సోఆ ఇచ్చి దాడులపై స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు వెంటనే దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పోడు భూములకు సంబంధించి రైతులందరికీ పట్టాలివ్వాలన్నారు. లేనిపక్షంలో పోరాటాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, మాజీ ఎంపీటీసీ కొమురయ్య, వార్డు సభ్యులు రవి, శ్యాంసుందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.