Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
గండ్డోర్రె గుట్ట నుంచి శ్రీనాగులమ్మ గురువారం మధ్యాహ్నం 11 గంటలకు ఆలయ ప్రవేశం చేసింది. ఆలయ ట్రస్టీ బాడిశ రామకష్ణ స్వామి, ప్రధాన పూజారి బాడిశ నాగ రమేష్ ఆధ్వర్యంలో గిరిజన పూజారులు, వడ్డెలు గండ్డోర్రె గుట్టలోని కార్తీకరాజు, చీకటి రాజులకు ఆదివాసీ గిరిజన సాంప్రదాయంతో పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి పాలమాకు ఒర్రె నుంచి రమణక్కపేటకు చేరుకున్న నాగులమ్మకు లక్ష్మీనర్సాపురంలోని గుడి వరకు వందలాదిగా గిరిజనులు డోలీలతో స్వాగతం పలుకుతూ నత్యాలు చేసి అలరించారు. పూర్తిగా కోవిడ్ నిభందనల మేరకు శ్రీ నాగులమ్మను గిరిజన కళాకారులు, మహిళలు కోలాటాలతో స్వాగతం పలికి గుడిలో ప్రతిష్టించారు. గురువారం రాత్రి 12 గంటలకు శ్రీనాగలమ్మ-పగిడిద్దరాజు కల్యాణం నిర్వహిస్తామని ఆలయ ట్రస్టీ బాడిశ రామకష్ణ స్వామి, ప్రధాన పూజారి బాడిశ నాగ రమేష్ తెలిపారు. ప్రధాన పూజారులు కొమరం ధనలక్ష్మీ, బాడిశ నాగనవీన్, దేవికలతోపాటు పూజారులు, వడ్డెలు మడకం లక్ష్మయ్య, సోడి సత్యం, కుర్సం పుల్లయ్య, సోడి శ్రీను, ఈసం సమ్మక్క, ఈసం రామనాధం, బాడిశ దేవిక, కట్టం సమ్మక్క, మోయిబోయిన శివ, సోడి శివనాగేశ్వరి, చౌళం భవాని, మడకం సుప్రజ, కుర్సం హేమలత, కులపెద్దలు కుర్సం విష్ణుమూర్తి, బొగ్గుల కష్ణమూర్తి, బాడిశ శ్రావణ్‌కుమార్, చౌలం నర్సింహారావు, రాంబాబు, కొర్స వెంకటేశ్వర్లు, నర్సింహారావు, కొమరం ఈశ్వరమ్మ, యడం సంజీవ, కాంరం సాంబయ్య, కొర్స ములసయ్య, కుర్సం లక్ష్మీనర్సు పాల్గొన్నారు.
నాగదేవతను దర్శించుకున్న బీజేపీ నాయకులు
నాగదేవత జాతరను బీజేపీ అనుబంధ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకుడు భూక్యా రాజునాయక్ దంపతులు, జిల్లా అద్యక్షుడు జినుకల సంజీవరావు, నాయకులు అడప భిక్షపతి, సిరికొండ బలరామ్, మండల మాజీ అద్యక్షుడు చిల్కమర్రి శ్రీనివాస్, బాల మురళీ, రావుల జానకీరావు, ధనుంజయ, నందు, తదితరులు దర్శంచుకున్నారు.