Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్
నవతెలంగాణ-శాయంపేట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపడుతుండగా స్మశాన వాటిక నిర్మాణంలో అలసత్వం ప్రదర్శించిన వసంతపూర్ సర్పంచ్ ముక్కెర అనూషను పదవి నుండి సస్పెండ్ చేసినట్టు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ఎం హరిత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 సెక్షన్(52) ప్రకారం స్మశాన వాటిక నిర్మాణంలో సెక్షన్ (37) ప్రకారం సర్పంచ్ విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. గతేడాది ఆరు నెలలుగా అవగాహన నోటీసు, సమీక్ష ద్వారా మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులు పలు సూచనలు చేసినప్పటికీ స్మశాన వాటిక నిర్మాణం చేపట్టడంలో సర్పంచ్ విఫలమయ్యాడన్నారు. పనులను పూర్తి చేయుటకు గ్రామపంచాయతీ ఖాతాకు ప్రతి నెల ప్రభుత్వ నిధులను నేరుగా జమ చేస్తున్నట్టు చెప్పారు. కలెక్టర్ నుండి రూ.2లక్షల వరకు ఉపాధి హామీ కింద ఎంపీడీవో, పీడీ ద్వారా ఎఫ్టిఓ జనరేట్ చేసిన మొత్తానికి అడ్వాన్స్‌గా రీయింబర్స్మెంట్ ప్రతిపాదికన తీసుకోవడానికి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. అయినప్పటికీ స్మశాన వాటిక నిర్మాణ పనుల్లో పురోగతి లేనందున వసంతపూర్ సర్పంచ్ ముక్కెర అనూషను సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.