Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతి
నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్ నగరంలోని కేఎంసీకి అనుబంధంగా ఉన్న ఎంజీఎం, రీజినల్ కంటి దవాఖాన, టీబీ ఆస్పత్రి, సీకేఎం, జీఎహెచ్ తదితర ఆస్పత్రుల్లో సుమారు 800 మంది పేషెంట్‌కేర్, సానిటేషన్ , సెక్యూరిటీ గార్డులు 15 ఏండ్లుగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారని వారి సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ వరంగల్ అర్బన్ జిల్లా కమిటిఅధ్యక్షులు జి ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి రాగుల రమేష్ డిమాండ్ చేశారు. గురువారం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రాన్ని సమర్పిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీరికి కనీస వేతనాలు, పని భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ సక్రమంగా అమలు కావడం లేదని అన్నాఉ. వారం రోజులుగా ఆందోళనలు చేసున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఔట్ సోర్సింగ్ క్యాటగిరిలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలలో నిర్దిష్టత లేకుండా ప్రకటించారన్నారు. ఎంజీఎంలో ఓసీఎస్ కింద భర్తీ చేసే 300 ఔట్ సోర్సింగ్ పోస్టుల పై తగు విచారణ జరిపి అర్హులు, సీనియారిటి ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులతో పోస్టులు భర్తీచేయాలన్నారు. కనీస వేతనం రూ.24వేలు అమలు చేయాలన్నారు. నూతన పీఆర్సీ ప్రకారం వెంటనే టెండర్లు పిలిచి కార్మికులకు కనీస వేతనం అమలయ్యేలా చూడాలన్నారు. డీఎంఈ ప్రిన్సిపల్ సెక్రటరితో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలు పరిష్కరించేలా చూడాలన్నారు.
అరెస్టు చేసిన కార్మికులను విడుదల చేయాలి
ఎంజీఎం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులను పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమని, వారిని వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ వరంగల్ అర్బన్, రూరల్ జిల్లా కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళన విషయం తెలుసుకున్న ఆయన గురువారం కార్మికుల వద్దకు వచ్చి మాట్లాడారు. అధికారులు చర్చలకు పిలవకుండా కార్మికులను పట్టించుకోవట్లేదన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంట్రాక్టు కార్మికులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. అధికారులు చొరవ చూపి కార్మికుల డిమాండ్లు పరిష్కరించేలా చూడాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఘటనాస్థలికి రాక పోవడం విడ్డూరమన్నారు. కలెక్టర్ చొరవ చూపి సమస్యను పరిష్కరించా లన్నారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, టీపీసీసీి ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, టీపీసీసీ కార్యదర్శులు కొత్తపల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాష్, ి ఆర్గనైజింగ్ సెక్రటరీ దుబ్బా శ్రీనివాస్, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మహమ్మద్ ఆయుబ్, జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మెన్ రామకృష్ణ పాల్గొన్నారు.