Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నడి రోడ్డుపై గురువుల భిక్షాటన
నవతెలంగాణ-న్యూ శాయంపేట
'బడులు తెరవండి, మా బాధలు తీర్చండి' అని ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులతోపాటు యాజాన్యాలు డిమాండ్ చేశాయి. గురువారం వాడుప్సా ఆధ్వర్యంలో హన్మకొండ డీఈఓ కార్యాలయం నుంచి ఏకశిలా పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ మధ్యలో కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి కొందరు ఉపాద్యాయులు టీ లు అమ్ముతూ, మరికొందరు బిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం ఏకశిలా పార్క్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వాడుప్స అధ్యక్షుడు రమేష్‌రావు మాట్లాడుతూ.. కరోనా కారణంగా గతేడాదిగా పాఠశాలలు మూస ివేయడంతో వేలాదిమంది ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులు వేతనాల్లేక కుటుంబాలు పోషించు కొలేక కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతు న్నారని అన్నారు. చదువులు చెప్పాల్సిన ఉపాధ్యా యులు కూరగాయలు, పాలు అమ్ముకుంటు పూట గడుపుతున్నారని అన్నారు. మరికొందరు కూలీ, మేస్త్రీ పనులకు కూడా వెళ్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఫిబ్రవరిలో పాఠశాలలు ప్రారంభించిన ప్రభుత్వం ఎన్నికలు పూర్తైన వెంటనే మూసివేయడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో సినిమా హాల్స్, మాల్స్ నడు స్తున్నాయని బడులు మూసివేసి బార్లు తెరవడం వల్ల కరోనా రాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాఠశాలను తెరవకుంటే భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని హెచ్చరించారు. వడుప్సా ప్రధాన కార్యదర్శి టామి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీశ, భూపాల్‌రావు, వరంగల్ అధ్యక్షులు రాజేష్ పాల్గొన్నారు.
పాఠశాలలు వెంటనే తెరిపించాలి
ఖిలా వరంగల్ : ప్రయివేటు పాఠశాలను వెంటనే తెరిపించాలని వడుప్సానాయకులు డిమాండ్ చేశారు. గురువారం వడుప్సా వరంగల్ జోన్ అధ్యక్షుడు బిల్లా రవి అధ్యక్షతన కమిటీ ఆధ్వర్యంలో ఉరుసు దర్గా నుంచి రామ్ లక్ష్మణ్ గార్డెన్స్ వరకు పాఠశాలల యాజమాన్యాలు, టీచర్లు ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు కరోనా కాలంలో నెలకు రూ.10 వేలు చెల్లించాలన్నారు. విద్యార్థులకు ఫీజు రీయిం బర్స్మెంట్ సౌకర్యం కల్పించాలన్నారు. పాఠశాలల యాజమాన్యాలకు వడ్డీలేని రుణాలను అందజేయాల న్నారు. ఈ సంవత్సరం విద్యా క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ట్రస్మా రాష్ట్ర సలహాదారులు కే భూపాల్‌రావు, వడుప్స జిల్లా సలహాదారులు ఆడెపు శ్యామ్, జ్ఞానేశ్వర్ సింగ్, కొడిమెల రవి, రవీందర్, క్రాంతి కుమార్, కోడం శ్రీధర్, దాసి సతీష్ మూర్తి, భాశెట్టి వెంకటేశ్వర్లు, సామల సుధాకర్, జన్ను సంజీవ, గోపు ప్రవీణ్, బండి అవినాష్, తదితరులు పాల్గొన్నారు.
విద్యాసంస్థలను వెంటనే ప్రారంభించాలి : ఎస్ఎఫ్ఐ
శాయంపేట : రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలను వెంటనే ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ, వడుప్సా నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హన్మకొండ లోని సెయింట్ పీటర్స్ పాఠశాలలో అర్బన్ జిల్లా కార్యదర్శి భాష బోయిన సంతోష్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వడుప్సా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమేష్‌రావు, సతీష్ రాంబాబు, యూఈఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకట్ రెడ్డి, కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీధర్ లోతు, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి, ఏ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శరత్, పీడీఎస్‌యూ నగర కార్యదర్శి రాచకొండ రంజిత్, ఐద్వా జిల్లా కార్యదర్శి దీప, ఐఎఫ్టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున, తాప్సా రాష్ట్ర అధ్యక్షులు చౌహాన్, కాకతీయ యూనివర్సిటీ ఉపా ధ్యక్షుడు కళ్యాణ్ తదితరులు పాల్గొని ప్రసంగిం చారు. ప్రభుత్వం ఓట్లు సీట్ల మీద ఉన్న శ్రద్ధ విద్యారంగం మీద లేదని అన్నారు. వేలమంది ప్రైవేటు ఉపాధ్యాయులు తినడానికి తిండి లేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. నిధులు కేటాయించకుండా ప్రభుత్వ విద్యా సంస్థల్లో కరోనాను ఎలా అరికడతారన్నారు. వెంటనే ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు ప్రారంభించి కరోనా కట్టడికి బడ్జెట్ కేటాయిం చాలని డిమాండ్ చేశారు. ప్రయివేటు ఉపాధ్యా యులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.