Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాముత్తారం
అర్హులైన ప్రతిఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని సీపీఐ(ఎం) పాదయాత్ర రథసారధి బంధు సాయిలు కోరారు. మహాముత్తారం, వేమనపల్లి, నిమ్మగూడెం, సింగంపల్లి, కనుకనూరులో మూడు రోజుల పాటు 50 కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా గురువారం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని, నిర్మాణంలో ఉన్నవి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని, అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత గిరిజనులకు ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. హమాలీ కార్మికులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, పింఛను మంజూరు చేయాలని అన్నారు. రైతులకు రుణ మాఫీ చేస, కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వాలన్నారు. జిల్లాలో దళిత గిరిజనుల పై జరిగే దాడులను అరికట్టాలన్నారు. తునికాకు కూలీలకు పెండింగ్ బోనస్ చెల్లించాలన్నారు. 50 ఆకుల కట్టకు 5 రూపాయలు చెల్లించాలన్నారు. ఇన్సూరెన్స్ ఐదు లక్షలు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పని 200 రోజులకు పెంచి రోజు కూలి రూ.600 ఇవ్వాలన్నారు. పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా అర్హులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణాలు అందించాలన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. మేడిగడ్డ, అన్నారం, దేవాదుల ద్వారా ప్రతి చెరువు, కుంటలకు నీరందించాలన్నారు. డ్వాక్రా గ్రూపు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని అన్నారు. మహాముత్తారం లో. జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ వెంటనే మంజూరు చేయాలన్నారు. ఈ సమస్యల పరిష్కారంతోపాటు గ్రామం, మండల సమస్యలను పాదయాత్ర బృందర దృష్టికి తీసుకురావాలన్నారు. తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి. సమస్యల పరిష్కారానికి పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, సురేష్. కిరణ్, ప్రశాంత్, రాజేందర్ పాల్గొన్నారు.