Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు
నవతెలంగాణ-శాయంపేట
అభం శుభం తెలియని చిన్నారికి పుట్టుకతోనే గుండెకు రెండు చిల్లులు పడటంతోపాటు చెడు రక్తనాళం బ్లాక్ అయింది. కుమారుడిని బతికించుకోవడానికి ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. మూడు ఆపరేషన్లకు రూ.8లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో పేద కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. వివరాల్లోకెళ్తే..
శాయంపేట గ్రామానికి చెందిన దపంతులు వంగరి రాజు, విజయకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రాజు చికెన్ సెంటర్ లో రోజువారి కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య విజయ బీడీల పని చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తోంది. 2019 ఆగస్టులో వరంగల్ పట్టణంలోని సీికేఎం ప్రభుత్వ ఆస్పత్రిలో విజయ కుమారుడికి జన్మనిచ్చింది. పుట్టుకతోనే గుండెలకు రెండు చిల్లుల పడగ, చెడు రక్తనాళం బ్లాక్ అయిందని డాక్టర్లు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో బాబును వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా చికిత్స అందక పోవడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుండి వైద్యులు నిలోఫర్ ఆస్పత్రికి రిఫర్ చేయడంతో పదిహేను రోజులపాటు వైద్య చికిత్స చేశారు. ఇంతకు మించి ఇక్కడ వైద్య సౌకర్యం లేదని వైద్యులు తెలపడంతో ప్రైవేటు స్టార్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ కూడా బాబుకు ఆక్సిజన్ అందిస్తూ వైద్య చికిత్స అందించారు. బాబుకు మూడు ఆపరేషన్లు చేయాల్సి ఉందని రూ.8లక్షల ఖర్చు అవుతుందని తెలపడంతో ఆపరేషన్ చేయడానికి డబ్బులు లేక స్వగ్రామానికి తీసుకొచ్చారు. బాబు పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు లక్ష రూపాయలు ఖర్చు వచ్చిందని, రోజు పని చేస్తేనే రూ300 వస్తాయని, ఉండడానికి ఇల్లు లేక కిరాయి ఇంట్లో నివసిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. బాబు మందులకు నెలకు రూ.5వేలు ఖర్చు వస్తుందని దాతలు ముందుకు వచ్చి ఆపన్నహస్తం అందిస్తే బాబుకు శస్త్ర చికిత్స చేయిస్తానని వేడుకుంటున్నారు. దాతలు 9052451172లో సంప్రదించాలని, ఎస్బీఐ శాయంపేట బ్యాంక్ ఖాతా నెంబర్ 40026489833, ఐఎఫ్సీ కోడ్ ఎస్బీఐఎన్0005325 లో ఆర్థికసాయమందించాలని కుటుంబీకులు వేడుకుంటున్నారు.