Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూలే, అంబేద్కర్ స్ఫూర్తితో ఉద్యమించాలి
- 5 నుంచి సందేశ్ యాత్రలు
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-న్యూశాయంపేట
మతోన్మాదుల నుంచి రాజ్యాంగాన్ని రక్షిం చాలని, ఆ దిశగా పూలే, అంబేద్కర్ స్ఫూర్తితో ఐక్యంగా ఉద్యమించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు పిలుపు నిచ్చారు. హన్మకొండలోని సుందరయ్య భవన్ లో జిల్లా అధ్యక్షుడు గబ్బెట రాంకుమార్ అధ్యక్ష తన గురువారం నిర్వహించిన సంఘం జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిధిగా స్కైలాబ్‌బాబు హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతోన్మాదంతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఈనెల 12న సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నీలి దండు కవాతు నిర్వహించాలని సూచించారు. బాబు జగ్జీవన్‌రామ్, జ్యోతిరావు పూలే, డాక్టర్ అంబేద్కర్ జయంతుల సందర్భంగా ఈనెల 5 నుంచి సందేశ్ యాత్రలు చేపట్టలని తెలిపారు. కేంద్ర ప్రభుతం దళితుల వ్యతిరేకిగా మారిందని విమర్శించారు. రిజర్వేషన్లను రద్దు చేసే, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వెలిబుచ్చారు. రాజ్యాంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను రక్షిస్తూ పోరాటాలు చేపట్టాలని దిశా నిర్ధేశం చేశారు. రాష్ట్రంలో ఇంకా అంటరానితనం, కులవివక్ష కొనసాగుతున్నట్టు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన దళితులకు బ్యాంకు లింకు లేకుండా రుణాలివ్వాలని, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సంఘం మాజీ జిల్లా కార్యదర్శి టి ఉప్పలయ్య మాట్లాడుతూ సంఘం నిర్వహిస్తున్న సామాజిక ఉద్యమాలు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. మహనీయుల స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. సంఘం జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ మాట్లాడుతూ ఈనెల 5 నుంచి తలపెట్టిన సందేశ్ యాత్రలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఆ సంఘం జనగామ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తూటి దేవదానం బొట్ల శేఖర్, జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ గడ్డం కష్ణ, జిల్లా నాయకులు బొట్ల స్వామిదాస్, కొత్తపల్లి శంకర్, ఆవుల ఉదరు, కుమారస్వామి, వేల్పుల రవి, కంజర్ల కుమారస్వామి, నల్ల సురేష్, జిల్లా నగేష్, గబ్బెట రాజు, పందుల శ్రావణ్, శివప్రసాద్, సింగారపు సుమన్, మంజుల, శైలజ, వనజ, తదితరులు పాల్గొన్నారు.