Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులకు ఫిర్యాదుజాతీయ రహదారిపై ధర్నా
నవతెలంగాణ-తొర్రూరు
పెద్దవంగర మండలంలోని కోరిపల్లి గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మా ర్పీఎస్, జైభారత్ ఎస్సీ పోరాట వేదిక, అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు వెలిశాల శ్యాంకుమార్, ఈదురు సైదులు, రాంపాక కిరణ్, ఎర్ర వెంకన్న మాట్లాడారు. తొలుత మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి పోలీస్స్టేషన్ వరకు నిరసనా ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఉపేందర్, గద్దల వెంకన్న, చిలుక సంపత్, యాకయ్య, ఎర్ర రవి, సందీప్, అశోక్, వినరు, బాలాజీ, రమేష్, సుధాకర్, రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు.