Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-డోర్నకల్
మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాల్సి వస్తుందని సీఐ శ్రీనివాస్ తెలిపారు. మండల కేంద్రంలోని రైల్వేస్టేషన్ నుంచి మసీద్ సెంటర్ వరకు ఎస్సై భద్రునాయక్ ఆధ్వర్యంలో పోలీస్స్టేషన్ సిబ్బంది శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడారు. కరోనా నిర్మూలన కోసం ప్రజలు ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలు పాటించాలని సూచించారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ వాంకుడోత్ వీరన్న, హెడ్ కానిస్టేబుల్ వీరస్వామి, ముజాఫర్, వార్డు కౌన్సిలర్లు పోటు జనార్ధన్, శరత్, తదితరులు పాల్గొన్నారు.