Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విత్తనాలు, అపరాల పట్టివేత
నవతెలంగాణ-వెంకటాపురం
అపరాలు, విత్తనాలు అక్రమంగా అనధికార గోడౌన్లో నిల్వ ఉంచారనే సమాచారం మేరకు రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించి అక్రమ నిల్వలను బట్టబయలు చేసి స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ అధికారి వాజీద్ కథనం ప్రకారం.. మండలంలోని గ్రామ పంచాయతీ వీధిలో అపరాలు, విత్తనాలు అక్రమంగా ముగ్గురు వ్యాపారులు నిల్వ చేశారనే సమాచారం మేరుకు ముగ్గురు అపరాల వ్యాపరస్తుల ఇండ్లలో దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ చేసిన 120 బస్తాల మినుములు, 67 బస్తాల పెసలు, 9 బస్తాల బొబ్బర్లు, 368 బస్తాల జనుము విత్తనాలు ఉన్నట్లు గుర్తించారు. సదరు నిల్వలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాడుల్లో డిప్యూటీ తహసీల్దార్ రాము, ఎస్సై తిరుపతి, ఏఈఓ సుకుమార్, తదితరులు పాల్గొన్నారు.