Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామాజిక ప్రజాస్వామిక వేదిక జిల్లా అధ్యక్షుడు లింగయ్య
నవతెలంగాణ-ములుగు
ప్రయివేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ఆదుకోవాలని సామాజిక ప్రజాస్వామిక వేదిక జిల్లా అధ్యక్షుడు చల్లా లింగయ్య ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో నియోజకవర్గ అధ్యక్షుడు పోరిక సామేల్నాయక్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశానికి లింగయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. లాక్డౌన్ కాలంలో విద్యాసంస్థలు మూసేయడంతో ప్రయివేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోవడంతో ఆశలు కలిగాయని, అనతికాలంలోనే ప్రభుత్వం మళ్లీ బంద్ చెయ్యాలని ఆదేశించడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని ఆందోళన వెలిబుచ్చారు. ప్రయివేట్ ఉపాధ్యాయులకు నెలకు రూ.15 వేలు చొప్పున భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కోరె రవి యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు మేకల సంజీవరావు, ఓదెలు, బానోతు సుభాష్, సుమన్, యాకన్న, వెంకటేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.