Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఉప సర్పంచ్ ధీకొండ సంధ్య
నవతెలంగాణ-తొర్రూరు
గ్రామ అభివద్ధిలో వార్డు సభ్యులను భాగస్వాములు చేస్తూ అన్ని విషయాల్లో సహకరించిన తనపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమోదించడం సమంజసం కాదని వెలికట్ట తాజా మాజీ ఉప సర్పంచ్ ధీకొండ సంధ్య బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రెండేండ్లలో సర్పంచ్ సహకారంతో అభివద్ధికి అనుకూలంగా అన్ని విషయాల్లో వార్డు సభ్యులను కలుపుకొని కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. వార్డు సభ్యులను ఎప్పుడూ బాధించని తనపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. తనతో ఏ సందర్భంలోనూ చర్చించని వార్డు సభ్యులు అవిశ్వాస తీర్మానానికి వెళ్లడం సరికాదన్నారు. గ్రామ ప్రజలంతా తనకు అండగా ఉండగా కేవలం వార్డు సభ్యులు మాత్రమే ఏకపక్షంగా అవిశ్వాసానికి వెళ్లడం దుర్మార్గమన్నారు. ఈ విషయాన్ని తాను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. మంత్రి దయాకర్రావు ఆదేశాలతో అధికారులు తనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.