Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసుల అవగాహనా ర్యాలీ
నవతెలంగాణ-తొర్రూరు
ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సీఐ కరుణాకర్ స్పష్టం చేశారు. లేనిపక్షంలో జరిమానా తప్పదని ఆయన హెచ్చరించారు. కరోనాను నిర్మూలించాలని కోరుతూ స్థానిక పోలీస్స్టేషన్ సిబ్బంది స్థానిక జాతీయ రహదారిపై శుక్రవారం అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కరుణాకర్ మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై నగేష్, పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.