Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
కాకతీయులు నిర్మించిన గణపేశ్వరాలయం(కోటగుళ్ళ)లో శుక్రవారం 'శరపంజరం' సినిమా షూటింగ్ జరిగింది. జీరో బడ్జెట్ తో తీస్తున్న సినిమాకు కథానాయిక లయ, కథానాయకుడు నవీన్‌కుమార్‌పై సన్నివేశాన్ని చిత్రీకరించారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ప్రోత్సహకంతో రూపాయి ఖర్చు లేకుండా సినిమాను చిత్రీకరిస్తున్నట్టు సంగీత దర్శకుడు ఎంవీకె మల్లిక్ తెలిపారు. తెలంగాణ సంస్కృతీసాంప్రదాయాల నేపథ్యంలో నిర్మిస్త్నున ప్రేమ కథా చిత్రమన్నారు. సినిమాకు కెమరామన్ మస్తాన్ సిరిపాటి, డ్రోన్ కెమరా ప్రశాంత్ గౌరవ్, నటీనటులు, జబర్ధస్త్ టీం వెంకి, జీవన్, రాజమౌళి, మౌనశ్రీ పాల్గొన్నారు.