Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం
- వ్యక్తి అరెస్ట్ : ఏసీపీ జితేందర్‌రెడ్డి
నవతెలంగాణ-న్యూ శాయంపేట
సీఐబీలో ఉద్యోగం చేస్తున్నానని, తనకు అన్ని శాఖల్లో పరిచయాలున్నాయని, ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసానికి పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి బొమ్మతుపాకి, కారుతోపాటు పలు ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం హన్మకొండ పోలిస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ చంద్రశేఖర్‌తో కలిసి ఏసీపీ జితేందర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. జనగామ జిల్లా ఇప్పగుడెం గ్రామానికి చెందిన లింగబాయిన వినోద్‌కుమార్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో హన్మకొండ గ్రీన్ స్క్వేర్ ప్లాజా వెనుక ఉన్న మనీ అపార్ట్మెంట్లో పానుగంటి నవీన్ పరిచయమయ్యాడు. అతను సీఐబీలో ఉద్యోగం చేస్తున్నా నని, అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగుల పరిచయాలతో పాటు రాజకీయ నాయకుల పరిచయాలు ఉన్నాయంటూ నమ్మబలికాడు. ఇటీవల రైల్వే శాఖ లో కొత్త రైల్వే లైన్లు వేస్తున్నారని, ఇందులో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ముందుగా కొంత డబ్బు ఇవ్వాలనడంతో వినోద్ కుమార్ ఉద్యోగం వస్తదని ఆశతో రూ.10లక్షల20వేలు ముట్టజెప్పాడు. అనంతరం నిందితుడు ఏదో ఒక సాకుతో వాయిదా వేస్తూ వచ్చాడు. వినోద్ విసిగి వేసారి హన్మకొండ పోలిస్స్టేషన్లో మార్చి 31న ఫిర్యాదు చేసాడు. పోలీసులు తమ శైలి లో విచారించి శుక్రవారం ఉదయం నిందితున్ని అరెస్ట్ చేశారు. నిందితుడు విజయవాడకు చెందిన అశోక్ స్నేహంతోనే ఈజీగా మనీ సంపాదించాలనే తపన తో సంవత్సర కాలంగా చాలా మంది అమాయకులను మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఏసీపీ తెలిపారు. ఉద్యోగిని అని నమ్మించడం కోసం బొమ్మ తుపాకీ తోపాటు కారు, పలు డూప్లికేట్ ఐడీ కార్డులు ఉపయోగి ఇంచడాని, వాటిని స్వాదీనం చేసుకు న్నామని తెలిపారు. అతనిపై హైదరాబాద్‌లో కూడా కేసు నమోదైందని అన్నారు. 20 రోజుల కిందటే ఒక అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్నారు. నిందితున్ని అరెస్టు చేసి విచారిస్తున్నామని తెలిపారు. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులను ఏసీపీ అభినందించారు. ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మొద్దని ఉద్యోగాల కోసం ప్రభుత్వం పలు ప్రత్యేక శాఖల ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుందని, వాటి ద్వారా మాత్రమే ఉద్యోగాలు పొందాలని ఏసీపీ సూచించారు .