Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల సభలో సర్పంచుల ఆగ్రహం
- విధులపై నిర్లక్ష్యం చేసిన ఏపీఓ సరెండర్
నవతెలంగాణ-నర్సంపేట
పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించడకుండా సర్పంచ్‌లను బాధ్యులను చేస్తూ నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని సర్పంచ్‌లు అధికా రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎంపీపీ మోతె కలమ్మ అధ్యతన నిర్వహించిన మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో పలు ఏజెండా అంశాలపై చర్చ సాగింది. డంపింగ్ యార్డులు, విలేజ్ పార్కులు, స్మశాన వాటికలను నిర్మాణాలలో జాప్యం జరిగిందని సర్పంచ్‌లను బాధ్యులను చేయడం సరికాదని రామవరం సర్పంచ్ కొడారి రవి అన్నారు. బిల్లులు వెనువెంటనే చెల్లించకుండా పనుల ను చేపట్టాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సభలోని మిగతా సర్పంచ్‌లు కూడా నోటీసులు జారీ చేయడాన్ని తప్పుపట్టారు. పనులను చేసిన సర్పంచ్‌లు బిల్లులు సకాలంలో రాకపోయే సరికి అప్పులపాలైయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. యేండ్ల తరబడి బిల్లులు ఇవ్వకుండా పనులెలా చేపట్టగలమని వాపోయారు. వెంటనే బిల్లులు చెల్లించాలని నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, బిల్లుల చెల్లింపు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉందని ఎంపీడీవో నాగేశ్వరావు తెలిపారు. ఉపాది పనులు చేపట్టడం లో కూలీలకు దినసరి వేతన డబ్బులు చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఎంపీటీసీ, సర్పంచ్‌లు తెలిపారు. ఈజీఎస్ ఏపీవో ఫాతిమాబేగం విధులకు సక్రమంగా హాజరు కానుందునే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఏపీవోను డీఆర్డీవోకు సరెండర్ చేయాలని పట్టుపట్టగా తీర్మాణం చేసి కలెక్టర్‌కు పంపిస్తా మని ఎంపీపీ తెలిపారు. వ్యవసాయ, హర్టికల్చర్, సెరికల్చర్ శాఖల అంశాల ప్రస్తావనలో సభ్యులు, సర్పంచ్‌లు జోక్యం చేసుకొంటూ అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయ కుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అధికా రుల సమాధానంతో సంతృప్తి చెందని ప్రజాప్రతినిధులు ఏవో కృష్ణప్రసాద్‌పై మండిపడ్డారు. అంగన్వాడీ, వైద్యా రోగ్య, రెవిన్యూ, ఇంజనీరుశాఖల అధికారులు పురోగతిని నివేదించారు.