Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
ఎలక్ట్రిక్ వాహనాలు కాలుష్య నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడుతాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని వరంగల్ రోడ్లో ఎకో ఫ్రెండ్లి బైక్స్ గ్రీన్ ఎలక్ట్రిక్ వాహనాల షోరూమ్‌ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. పెట్రోలీయం వాహనాల వాడకంతో కాలుష్యం పెరిగి పర్యావరణం దెబ్బ తింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించి కాలుష్యాన్ని నియంత్రించొచ్చన్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్ల తెలంగాణ రాష్ట్రం అదనపు విద్యుత్ ఉత్పత్తి సాధించే స్థాయికి చేరుకుందన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగినా కావాల్సిన విద్యుత్ సరఫరాను ప్రభుత్వం అందించనుందని తెలిపారు. వాహనాల కొనుగోళ్లుపెరిగి షోరూమ్ వ్యాపారం వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్, వైఎస్ చైర్మెన్ మునిగాల వెంకట్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మెన్ ఆకుల శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ చైర్మెన్ గుగులోతు రామస్వామినాయక్, టీఆర్ఎస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ మాజీ చైర్మెన్ నాగెల్లి వెంకటనారాయణ గౌడ్, కౌన్సిలర్లు నాగిశెట్టి పద్మ ప్రసాద్, గ్రీన్ ఎలక్ట్రిక్ షో రూమ్ యాజమాన్యం డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, సౌత్ జోనల్ మేనేజర్ ఆర్ రామకోటేశ్వర్రావు, సహారా ఇండియా నాన్ ఫైనాన్షియల్ హెడ్ (సౌత్) డి సుధీర్ రెడ్డి, షో రూమ్ ప్రతినిధులు కామగోని శ్రీనివాస్, కుండే సురేష్ తదితరులు పాల్గొన్నారు.