Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కేయూ క్యాంపస్
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ రావడంలేదని కలతచెంది ఆత్మహత్యకు పాల్పడిన కేయూ విద్యార్థి సునీల్ నాయక్ ఈరోజు హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో మార్చి 26న ఆత్మహత్యాయత్నం చేసి బలవన్మరణానికి ప్రయత్నిస్తూ సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. ఈ వీడియోలో తాను ఐఏఎస్ లక్ష్యంగా చదువుతున్నానని గ్రూప్స్ వంటి పరీక్షలు ప్రిపేర్ అవుతున్నానని ఉద్యోగ నోటిఫికేషన్ లేక నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందంటూ ఉద్యోగ నోటిఫికేషన్ పై ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ విద్యార్థులు ఉద్యోగ నోటిఫికేషనకు ప్రభుత్వంతో పోరాడాలని తన సెల్ఫీ వీడియోలో వివరించాడు. నిరుద్యోగ సమస్యను ప్రభుత్వానికి తెలియజేయాలని పేర్కొంటూ ఆత్మహత్యకు పాల్పడుతు న్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. మృతుని స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండాల్ సునిల్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కే యు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ ర్యాలీలు నిర్వహించారు.
ప్రభుత్వం న్యాయం చేయాలి : బీఎస్ఎఫ్
శాయంపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంతో, ఉద్యోగం రాదేమోనని మనస్థాపం చెంది పురుగుల మందు సేవించి 15 రోజులుగా చికిత్స పొందుతూ మృతిచెందిన బోడ సునిల్నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీఎస్ఎస్ అధ్యక్షులు మారేపల్లి క్రాంతికుమార్ డిమాండ్ చేశారు. సునిల్ మరణాన్ని నిరసిస్తూ శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కండ్లకు గంతలు కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరే కంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయ కుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. సునిల్ మరణానికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగులను, విద్యార్థులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రాణాలు తీసుకుని సాధించేది ఏమీ లేదని, పోరాడితే పోయేదేమీ లేదని బానిస సంకెళ్లు తప్ప అనే నినాదంతో ముందుకు సాగాలన్నారు. హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వానికి నిరుద్యోగులు, విద్యార్థులు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుమన్, ఎమ్మార్పీఎస్ నాయకులు దేవయ్య, భరత్, ప్రకాష్, కమల్ బాబు తదితరులు పాల్గొన్నారు.