Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీడియో తీసిన ఇద్దరిపై అట్రాసిటీ కేసు : డీఎస్పీ
నవతెలంగాణ-తొర్రూరు
మామిడి కాయల దొంగతనానికి వచ్చారంటూ ఇద్దరు మైనర్ బాలలను చితకబాది, చిత్రహింసలకు గురి చేసిన కేసులో తోట కాపలాదారులను అరెస్ట్ చేశామని, సదరు ఘటనను వీడియో తీసిన ఇద్దరు యువకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని బుడిగ జంగాల కాలనీకి చెందిన ఇద్దరు బాలలు తాము పెంచు కుంటున్న కుక్క తప్పి పోవడంతో గురువారం దాన్ని వెతుక్కుంటూ వెళ్తుండగా కంటాయపాలెం రోడ్డు లోని మామిడితోటలో కాపలాదార్లుగా పని చేస్తున్న మండలంలోని బొత్తల తండాకు చెందిన బానోతు యాకూబ్, అచ్చు తండాకు చెందిన బానోతు రాములు బాలలను మామిడి కాయల చోరీకి వచ్చారని అనుమానిస్తూ అడ్డుకుని తాళ్లతో కట్టేసి చితక బాదారని తెలిపారు. అలాగే ఇద్దరి నోట్లో ఆవుపేడ పెట్టి చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు. పట్టణానికి చెందిన పల్లె సతీష్, దొంగరి రాములు ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఎస్సై నగేష్ బందోబస్తుతో వెళ్లి తండాలోని ఓ ఇంట్లో దాగి ఉన్న యాకూబ్, రాములులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. యాకూబ్, రాములు మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జుడీషియల్ రిమాండ్కు తరలించి సతీష్, దొంగరి రాములుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేస్తామన్నారు.