Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు జి నాగయ్య
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎదునూరి వెంకట్రాజం తండ్రి మొండయ్య (80) మృతి బాధాకరమని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు జి నాగయ్య అన్నారు. మండలంలోని తాటికొండలోని నివాసంలో మొండయ్య మృతి చెందారు. ఈ క్రమంలో జి నాగయ్యతోపాటు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, వ్యకాస జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్, వెంకట్రాములు, తదితరులు మొండయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం నాగయ్య మాట్లాడారు. మొండయ్య కష్టజీవులకు అండగా నిలిచే కమ్యూనిస్టు పార్టీకి ప్రజల పక్షాన పోరాడేందుకు తనయుడిని అందించాడని కొనియాడారు. మొండయ్య మృతి బాధాకరమన్నారు. మొండయ్య కుటుంబానికి ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. కార్యక్రమంలో ఇప్పగూడెం సర్పంచ్ అజరురెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య, జీఎంపీఎస్ రాష్ట కార్యదర్శి ఉడుత రవీందర్, నాయకులు రాపర్తి సోమయ్య, బూడిద గోపీ, ఉడుత రవి, వైస్ ఎంపీపీ చల్లా సుధీర్‌రెడ్డి, గట్ల కొండల్‌రెడ్డి, సాంబరాజు, బొట్ల శేఖర్, మునిగెల రమేష్, సింగరపు రమేష్, నరేందర్, ఉపేందర్, ఎంపీటీసీ ఎన్నకూస కుమార్, పీఏసీఎస్ చైర్మెన్ నరేందర్‌రెడ్డి, రొయ్యల రాజు, రాములు, యాదగిరి, పొదల నాగరాజు, కొడెపాక యాకయ్య, చిట్యాల సోమన్న, ఆజాద్, దేవదానం, మధుబాబు, ఉమ్మగోని రాజు, తదితరులు పాల్గొన్నారు.