Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు
నవతెలంగాణ-బయ్యారం
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలని మహాబాద్ జెడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు నాయక్ అన్నారు. మండల ప్రజాపరిషత్ కారా ్యలయంలో ఎంపీపీ మౌనిక అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా బిందు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాఖల వారీగా సమీక్షించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ మండలంలో పామాయిల్ తోటలు పెంచడానికి గల అవకా శాలు, ఆర్ధిక లాభాలపై సభ్యులకు అవగాహన కల్పించారు. అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీరామ్ ప్రస్తుత కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అనంతరం బిందు మాట్లాడారు. అధికారులు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజలకు అందించడంతోపాటు వాటి ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రజాప్రతి నిధులకు తెలపాలని చెప్పారు. ఏవైనా సమస్య లుంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తాత గణేష్, సొసైటీ చైర్మెన్ మూల మధూకర ్రెడ్డి, ఎంపీడీఓ చలపతిరావు, తహసీల్దార్ నాగ భవాని, తదితరులు పాల్గొన్నారు.