Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 312 తూటాలు, 2 డిటోనేటర్లు, కరపత్రాలు స్వాధీనం
నవతెలంగాణ-ములుగు
మండలంలోని మాన్సింగ్ తండా పరిసరాల్లోని పోడుభూముల్లో మావోయిస్టు పార్టీ నక్సలైట్లు దాచిన డంపు లభించిందని ఏఎస్పీ పోతరాజు సాయిచైతన్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్పీ సాయిచైతన్య వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం అందడంతో శనివారం ఉదయం ఎస్సై హరికృష్ణ, పోలీసు సిబ్బందితోపాటు ఇద్దరు వీఆర్వోలను, ఫొటోగ్రాఫర్‌ను వెంట తీసుకుని మాన్సింగ్ తండా పరిసరాల్లోని పోడుభూముల్లో పరిశీలించారు. ఓ చోట అనుమానం వచ్చి తవ్వగా మీటర్ లోతులో స్టీల్ బకెట్లో దాచిన డంప్ లభించింది. పంచుల సమక్షంలో పరిశీలించగా అందులో 312 తూటాలు, రెండు డిటోనేటర్లు, సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన పత్రాలు లభించాయి. సమావేశంలో ఏఎస్పీ చెన్నూరి రూపేష్, డీఎస్పీ దేవేందర్‌రెడ్డి, ఎస్బీ సీఐ రెహ్మాన్, తదితరులు పాల్గొన్నారు.