Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాదయాత్ర బదానికి సమస్యల వెల్లువ
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లా సమగ్ర అభివద్ధికై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర నాలుగో రోజుకు వంద కిలోమీటర్లు దాటింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గత నెల 30వ తేదీన మహాముత్తారం మండలం స్తంభం పల్లి గ్రామం లో ప్రారంభమైన పాదయాత్ర మొదటిరోజు కొత్త రేగుల గూడెం, పాత రేగుల గూడెం, బోర్ల గూడెం, నర్సింగాపూర్ గ్రామాల్లో కొనసాగింది. 31వ తేదీన నందిగామ, దీక్షకుంట, గొల్ల బుద్ధారం , రాంపూర్, రాజీవ్ నగర్, నాగారం, ఆజాం నగర్ వరకు కొనసాగింది. ఒకటో తేదీన మహా ముత్తారం ,వేమనపల్లి ,నిమ్మ గూడెం, అన్నారం, కనుక నూరు వరకు రెండో తేదీన 3 ట్యాంకులు, కష్ణాపూర్ వరకు, మూడవ తేదీన పలిమెల,పెద్దంపేట, అంబటిపల్లి, సూరారం ,వరకు సాయంత్రం సమయాన చేరుకొంది. దీంతో స్తంభం పల్లి నుండి సూరారం వరకు వరకు 100 కిలోమీటర్ల పాదయాత్రను ఈ బందం విజయవంతంగా పూర్తి చేసుకుంది:
సమస్యల పరిష్కారానికే పాదయాత్ర
జిల్లాలో కొన్న సమస్యల పాలకుల దష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి పాదయాత్ర చేస్తున్నాం. గత నెల 30వ తేదీన ప్రారంభమైన పాదయాత్ర శనివారం నాటికి 26 గ్రామాల్లో కొనసాగి వంద కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పాదయాత్రలో ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజ లు తమ దష్టికి తీసుకువస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్న సమ యంలో అనేక సమస్యలు పాదయాత్ర బందం దష్టికి వచ్చాయి. పాదయాత్రలో స్వచ్ఛందంగా తమకు చేదోడు వాదోడుగా నిలుస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు. ఇదే స్పూర్తితో పాదయాత్ర కొనసాగిస్తాం.
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు