Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాన్ని సందర్శించిన డీపీఓ, డీఎస్పీ
నవతెలంగాణ-మహదేవపూర్
మండలంలోని ఎడపల్లి గ్రామంలో పది రోజుల నుంచి కరుణ పరీక్షలు చేస్తున్న కొద్దీ రోజురోజుకూ పెరగడం తప్ప తగ్గడం లేదని దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం మరో 2 పాజిటివ్ వచ్చినట్టు డాక్టర్ రామారావు తెలిపారు. దీంతో బాధితుల సంఖ్య 49కి చేరుకుంది. వరుసగా కరోనా టెస్ట్‌లు పెరు గుదలతో శనివారం జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత కాటారం డీఎస్పీ బోనాల కిషన్ గ్రామాన్ని సందర్శించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు గ్రామస్తులు భయాందోళనకు గురికావద్దని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని డీపీఓ తెలిపారు. గ్రామంలో బ్లీచింగ్ పౌడర్‌తో పాటు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత చూసుకోవాలనే గ్రామస్తులను కోరారు. వారి వెంట మహాదేవపూర్ ఎస్సై అనిల్ కుమార్, ఎంపీడీఓ రఘునాథ్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.