Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారుల మౌనం.. రియాల్టర్ల అడ్డదారి ప్రయత్నాలు..!
- పేదలకు ఇండ్ల స్థలాలల పట్టాలు ఇచ్చే దాకా పోరాటం ఆగదు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య
నవతెలంగాణ-నర్సంపేట
పట్టణంలోని కాకతీయ నగర్ సమీపంలోని 601 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేశారు. అన్యాక్రా ంతమౌతున్న ఈ ప్రభుత్వ భూమిని అధికారులు రక్షించడంలో వైఫల్యం చెందారని విమర్శలు వెలువడుతున్నాయి. వేలాది మంది ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలు అద్దె ఇండ్లల్లో మగ్గుతూ తీవ్ర ఇక్కట్ల పాలైతున్నారు. ప్రభుత్వం పేదలకు ఇస్తామని చెప్పిన డబుల్ బెడ్ రూమ్ హామీ నేటికీ నెరవేరకుండా పోయింది. ఈ క్రమంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిని కాపా డాలనీ, పేదలకు ఇండ్ల స్థలాలు దక్కాలనే డిమాండ్‌తో పేదలచే గుడిసెలు వేయించారు. నెక్కొండ రోడ్డు ప్రధాన రహదారి పక్కన ఉన్న ఇట్టి విలువైన ప్రభుత్వ భూమిపై కన్నుపడి ఆక్రమించిన రియాల్టర్లు ఇంకా ఈ భూమిపై ఆశ చావలేదు. అడ్డదారిలో చేజిక్కించుకొనేందుకు పావులు కదుపుతున్నారు. పలువురి అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. సర్వే నెంబర్ 601లో మొత్తంగా 5.32 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్రభుత్వ భూమిలో 601/1/1లో 1.39 ఎకరాలు, 601/1/2లో 1.00 ఎకరం ప్రభుత్వ స్థలం ఉండగా 601/2 బైరబోయిన వెంకటయ్య అనే వ్యక్తి 1.33 ఎకరాలు, 601/2/3లో బైరబోయిన రాంప్రసాద్ 0.10 గుంటలు, 601/2/అలో 0.7గుంటలు, 601/2/4అ పరిధిలో సల్లూరి రాము అనే వ్యక్తికి 0.3 గుంటలు, 601/2/ఏలో బైరబోయిన నాగరాజు అనే వ్యక్తికి 0.10 గుంటలు, బైరబోయిన బాలకిషన్ అనే వ్యక్తికి 601/2/బీలో 0.10 గుంటల వ్యక్తికి లావాణీ పట్టాను ఇచ్చారు. కొందరు తమకున్న లావాణీ పట్టా పరిధిలో భూమి కాకుండా అదనంగా పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కొంతకాలంగా కొందరి అండదండలతో సాగు చేస్తూ వచ్చారు. 2016లో తహసిల్దార్ ఉమారాణి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కేటాయించారు. తహసీల్దార్ కొద్ది రోజుల్లోనే బదిలీ కాగా ఈ భూమిని తిరిగి ఆక్రమించేశారు. 2.39 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా తమదేనంటూ నమ్మబలికి ఇటీవల రియాల్టర్లకు విక్రయించినట్లు తెలిసింది. ఎకరానికి కోట్లలో ధర పలుకుతున్న ఈ భూమి ప్రభుత్వానిదే అని తెల్సి రియాల్టర్లు కారు చౌక ధరతో ఒప్పందం చేసుకొని వెంచర్ చేసేందుకు పావులు కదిపారు. ఆక్రమిత పాలవుతున్న ప్రభు త్వ భూమిని రక్షించుకొనేందుకు సీపీఐ(ఎం) పేదల ఇండ్ల స్థలాల సాధన పోరా టానికి సంకల్పించింది. వందలాది మంది పేదలు కదిలొచ్చి గుడిసెలు వేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ భూమిని రక్షించుకుని పేదలకు పంచిపెట్టాలనే ధృడ సంకల్పంతో పోరాట కార్యచరణకు పూనుకుంది. పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలిచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని పేదలు భీష్మించేశారు.