Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు భూములకు పట్టాలివ్వాలి
- సీపీఐ(ఎం) పాదయాత్ర రధసారథి బంధు సాయిలు
నవతెలంగాణ-పలిమెల
తునికాకు కూలి రేటుల పెంచాలని సీపీఐ(ఎం) పాదయాత్ర రధసారథి బంధు సాయిలు అన్నారు. జిల్లా సమగ్ర అభివద్ధికై నిర్వహిస్తున్న పాదయాత్ర ఐదో రోజు పలిమెల బొడాయి గూడెం, పంకెన, లెంకల గడ్డ, పెద్దంపేట, అంబటిపల్లి వరకు చేరుకుంది. ఈ సంద ర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తునికాకు కూలి రేట్లు యాభై ఆకులకు కట్టకు 5 రూపాయలు ఇవ్వాలని పెండింగ్‌లో ఉన్న కూలీ ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న బోనస్‌ను వెంటనే చెల్లించాలని తెలిపారు. ఇన్సూరెన్స్ ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పలిమెల మండలం మొత్తం పోడు భూములకు పట్టాలు లేవని ట్రాక్టర్లతో వ్యవసాయాన్ని అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఫారెస్టు అధికారులు, గిరిజనులపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ముస్లిం దొర సుమారు ఐదు వందల ఎకరాలను 100 మంది పేదలు 40 సంవత్సరాల నుండి సాగుచే సుకుంటున్న పట్టాలు ఇవ్వకుండా ఆ దొరికే రైతుబంధు ఇవ్వడం దుర్మార్గమన్నారు. సాగు చేసు కుంటున్న పేదలకు తక్షణమే పట్టాలు ఇచ్చొ రైతు బందు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కనే గోదావరి ఉన్న మండలంలోని ఏ ఊర్లో కూడా చెరువులు కుంటల్లో నీళ్లు లేవని ,క్షణమే మేడిగడ్డ, దేవా దుల ప్రాజెక్టు ద్వారా చెరువులు కుంటలు అను సంధానం చేసి రెండు పంటలకు సరిపోను నీరు అందించాలన్నారు. కరోనా సమ యంలో విద్యా సంస్థలన్నీ మూసివేసిన సమయంలో ఆన్లైన్ విద్య చెప్పడం ఫలితంగా పిల్లలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి పిల్లలకు ల్యాప్‌టాప్ ఇచ్చి నెట్ ఫ్రీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రం పేరుకే గాని పరిపాలన మొత్తం మహదేవ్పూర్ నుంచి కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ ఆఫీసులో ఏర్పాటు చేసి ఇక్కడి నుండి పరిపాలన కొనసాగించాలని సూచించారు. పోడు రైతులకు, కౌలు రైతులకు రైతుబంధు అమలు చేయాలని కోరారు. జిల్లాలో సింగరేణి జెన్కో పరిశ్రమలు ఉన్నాయి వీటి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర ద్వారా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహి స్తామని హెచ్చరించారు. పాదయాత్ర బందం గుర్రం దేవేందర్, నాగుల అరవింద్ ,పసుల వినరు, దామర కిరణ్, పొలం రాజేందర్, ఆత్కూరి శ్రీకాంత్ ముద్దుల శంకర్, జిల్లా నాయకులు బొట్ల చక్రపాణి దామర నరేష్ తదితరులు పాల్గొన్నారు.