Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హుండీ ఆధాయం రూ.3.49 లక్షలు
- ప్రకటించిన ఈఓ కిషన్‌రావు
నవతెలంగాణ-హసన్‌పర్తి
మండలంలోని ఎర్రగట్టుగుట్ట క్రాసురోడ్డులో ఐదు రోజుల పాటు నిర్వహించిన ఎర్రగట్టు వెంకన్న జాతర మొత్తం ఆదాయం రూ.9,00,643 వచ్చినట్లు ఆయల చైర్మెన్ పిట్టల సదానందం, ఈఓ కిషన్‌రావు ప్రకటించారు. గత సంవత్సరం జాతర ఆధాయం రూ.8,54,036 ఆదాయం రాగా ఈ సంవత్సరం గతం కంటే రూ.46,606 ఆదాయం ఎక్కువగా వచ్చినట్లు తెలిపారు. శుక్రవారం ఎర్రగట్టు వెంకన్న జాతర ఆలయ ఆవరణలో ఆలయ చైర్మన్ పిట్టల సదానందం, ఈఓ కిషన్‌రావు, ఎండోమెండ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ల పర్యవేక్షణలో ధర్మకర్తలు వేల్పుల సదానందం, ఉప్పు ప్రభాకర్, మూల దేవెందర్‌గౌడ్, మేరుగుత్తి రఘు, మేకల ప్రియాంకవేణు, వీసం రవీందర్రెడ్డిల ఆధ్వర్యంలో లక్ష్మీవెంకటేశ్వరస్వామి ట్రస్టు మహబూబాబాద్‌కు చెందిన 40 మంది సభ్యులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదురోజుల జాతర హుండీ ఆదాయం రూ.3.49,051 రాగా లడ్డూ ప్రసాదం రూ.1.80 లక్షలు, కొబ్బరికాయల వేలం ద్వారా రూ.1.20 లక్షలు, కొబ్బరి ముక్కల సేకరణ వేలం ద్వారా రూ.20 వేలు, సైకిల్ స్టాండు వేలం ద్వారా రూ.15వేలు, గుట్టపై ఆలయ ఆవరణలో గండ దీపం వేలం ద్వారా రూ.22,500, కేశఖండన ద్వారా రూ.1960, ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.63, 300, అష్టోత్తరం టిక్కెట్ల ద్వారా రూ.56,420, తైబజార్ ద్వారా రూ.44,670, కళ్యాణ కట్నాల ద్వారా రూ.2,116, స్వామివారి కళ్యాణం టికెట్ల ద్వారా రూ.8,772, విరాళాల ద్వారా రూ.16,853 మొత్తం రూ.9,00,642 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు వేదాంతం పార్థసార దాచార్యులు, ఆరుట్ల శ్రీధరాచార్యులు, మార్కెట్ డైరెక్టర్ చకిలం రాజేశ్వర్‌రావు, సిబ్బంది వేణుగోపాల్, రామక్రిష్ణ, శ్రీనివాస్, పవన్, చంద్రయ్య, తిరుపతి పాల్గొన్నారు.