Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
ఈనెల 8న సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహిస్తామని అఖిలభారత రైతుకూలి సంఘం జిల్లా నాయకులు యాదగిరి యుగంధర్ తెలిపారు. మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో యుగంధర్ మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పేద రైతులు సాగు చేసుకుంటున్న భూములపై అటవీ శాఖ అధికారులను ప్రభుత్వం భూములను బలవంతంగా లాక్కుంటోందని విమర్శించారు. 40 ఏండ్ల క్రితం నుంచి సాగు చేసుకుంటన్న భూములపై గత ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం రైతు పక్షపాతిగా ప్రచారం చేసుకుంటూనే దౌర్జన్యాలకు తెగబడుతోందని మండపడ్డారు. సమస్యల పరిష్కారానికి ఐక్యపోరాటాలే శరణ్యమన్నారు. బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఐక్యపోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమౌతాయని చెప్పారు. సభలో పార్టీ అగ్రనాయకులు ప్రసంగిస్తారని తెలిపారు. సమావేశంలో నాయకలు శ్రీశైలం, మంగయ్య, ప్రభాకర్, సురేందర్, పాపారావు, ఎర్రయ్య, రమేష్, కష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.