Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మండలంలోని పుల్లూరు గ్రామ పంచాయతీలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వడానికి శనివారం సర్పంచ్ మాళోత్ జ్యోతి అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో 20 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ స్వాతి బిందు మాట్లాడారు. 20 ఇండ్లకు గాను 62 మంది దరఖాస్తు చేసుకోగా గ్రామ సభలో 29 మందిని నిరుపేద కుటుంబాలను ఎంపిక చేసిన అనంతరం వారిలో స్థల దాతతో సహా 18 మందికి, మరో ఇద్దరిని డ్రా ద్వారా ఎంపిక చేశారు. అనేక సార్లు వాయిదా పడిన గ్రామ సభను ఎట్టకేలకు ఎస్సై బాదావత్ రవి నాయక్ పర్యవేక్షణలో ప్రశాంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీలక్ష్మీ, ఎంపీటీసీ బానోత్ మంజుల, ఉపసర్పంచ్ బానోత్ సురేష్, ఆర్ఐ నర్సింహారావు, వీఆర్వో ఉమ, తదితరులు పాల్గొన్నారు.