Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
అత్యాచారం కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పస్రా సీఐ అనుముల శ్రీనివాస్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు శనివారం ఉదయం కాటాపూర్ క్రాస్ రోడ్ వద్ద ఇద్దరినీ అరెస్ట్ చేశారు. మార్చి 30న మండలంలోని అటవీ ప్రాంతంలో ఓ యువతి, యువకుడు కలిసి ఉండగా కన్నాయిగూడెం మండలంలోని బుట్టయిగూడెంకు చెందిన కోల సాత్విక్, సైదులు, జనగం ఆనందరావు అటకాయించి యువకుడిని చితకబాది సెల్ఫక్షన్ లాక్కున్నారు. అలాగే అతడి ద్విచక్రవాహన టైర్ల నుంచి గాలి తీసి యువతిని బలవంతంగా ద్విచక్రవాహనంపై మణుగూరు తీసుకెళ్లారు. అనంతరం యువతిని సాత్విక్ అనే వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అత్యాచారానికి ఆనందరావు సహకరించాడు. యువతికి తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆనందరావు ఆమె స్వగ్రామంలో దించి వెళ్లిపోయాడు. అనంతరం నిందితులు తరచూ యువతికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. యువతి వెంట ఉన్న యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందిన రెండ్రోజుల్లోనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
సమాచారం ఇవ్వాలి
తాడ్వాయి, పస్రా ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాల్లో ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసిన, బెదిరింపులకు పాల్పడ్డా సమాచారం ఇవ్వాలని సీఐ, ఎస్సై తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.