Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘం, సీపీఐ(ఎం) అధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-గార్ల
సునీల్‌నాయక్ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు భూక్యా హరినాయక్, సీపీఐ(ఎం) జిల్లా నాయ కుడు కందునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గిరిజన సంఘం, సీపీఐ(ఎం) సంయుక్త ఆధ్వర్యంలోయ నెహ్రూ సెంటర్లో శనివారం రాస్తారోకో నిర్వహిం చారు. ఈ సందర్భంగా హరినాయక్, శ్రీనివాస్ మాట్లాడారు. సునీల్ ఆత్మహత్య కు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని స్పష్టం చేశారు. ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్య క్షుడు మాలోత్ శాంతికుమార్ మాట్లాడుతూ యువజనం ఆత్మహత్యలకు పాల్పడు తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను నియమించకుండా ప్రభుత్వం యువజనుల జీవితాలతో చెలగాట మాడుతోందని మండిపడ్డారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీ చేపడితే సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండేది కాదన్నారు. కార్య క్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గిరిప్రసాద్, సంఘీభావంగా కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి కృష్ణ, టీజేఎస్ నాయకులు మురళీ, నాయకులు వెంకటే శ్వర్లు, ఈశ్వర్‌లింగం, ఇమ్మడి వెంకన్న, చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.