Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12న జనగామలో నీలి దండు కవాత్
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 1 నుంచి 30 వరకు పూలే, అంబేద్కర్ సందేశ్ యాత్రలను పల్లెపల్లెకూ తీసుకెళ్తున్నట్టు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల శేఖర్ తెలిపారు. మండల కేంద్రంలో మండల అధ్యక్షులు చిలుముల్ల భాస్కర్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన విస్తతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా భాస్కర్ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ రాజ్యాంగం మద, రిజర్వేషన్లపైనా దాడి చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేస్తూ దేశ సంపదను కొల్లగొడుతోందని మండిపడ్డారు. రాజ్యాంగం, రిజర్వేషన్ల రక్షణ, ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని సూచించారు. మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా ఈనెల 12న జిల్లా కేంద్రాల్లో నీలిదండు కవాతు నిర్వహిస్తామని చెప్పారు. 30న జిల్లా కేంద్రంలో పూలే, అంబేద్కర్ జాతర నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 5న జగ్జీవన్‌రామ్, 11న మహాత్మా జ్యోతిరావు పూలే, 14న అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పల్లెపల్లెనా నిర్వహించాలని కోరారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పల్లెర్ల రజిత, మండల ప్రధాన కార్యదర్శి మంద మహేందర్, నాయకులు దైద అనిల్, బొంకురి తిరుపతి, మంద రంజిత్, తదితరులు పాల్గొన్నారు.