Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి
నవతెలంగాణ-ములుగు
సుదీర్ఘ పోరాటాల ఫలితంగా సాధించుకున్న స్వరాష్ట్రంలో యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి తెలిపారు. బీజేపీ అనుబంధ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట శనివారం నిరసనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా భాస్కర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో బోడ సునీల్ ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలోనే ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేస్తామంటూ ప్రకటిస్తూ నమ్మిస్తూ తదనంతరం యువతను విస్మరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరో మలిదశ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అజ్మీరా కష్ణవేణి, గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు నగరపు రమేష్, గాజుల కష్ణ, సీనియర్ నాయకులు తక్కెళ్లపల్లి దేవేందర్‌రావు, పోరిక ఉత్తమ్ కుమార్, భూక్యా రాజునాయక్, యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంతిరెడ్డి రాకేష్‌రెడ్డి, యువమోర్చ జిల్లా పదాదికారులు సానికొమ్ము హరీష్‌రెడ్డి, అజ్మీరా కిషోర్‌నాయక్, గుమ్మడెల్లి లక్ష్మన్, ప్రవీణ్, జిల్లా పదాధికారులు అడప భిక్షపతి, కొండూరు నరేష్, అల్లె జనార్ధన్, శ్రీమంతుల రవీంద్రాచారి, కర్ర సాంబశివారెడ్డి, శివగామి స్వప్న, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, చల్లూరి మహేందర్, మోర్చా అధ్యక్షుడు జినుకల కష్ణాకర్, చందా జ్యోతి, మహ్మద్ యాకూబ్ పాషా, రాయకంటి పరమేశ్వర్, మండల అధ్యక్షుడు ఇమ్మడి రాకేష్ యాదవ్, భూక్యా జవహర్, మద్దినేని తేజరాజ్, మల్లెల రాంబాబు, గండేపల్లి సత్యం, కందుల రాంకిషోర్, అట్లూరి రఘురామ్, నాయకులు గుమ్మడెల్లి స్వాతి, వేముల రామ, చెవుగంటి స్వప్న, సంగీత, ఉగ్గం సమ్మక్క, సురేందర్, చక్రి, సత్యనారాయణ, రాజ్‌కుమార్, సంతోష్, స్వామి, అవినాష్, తదితరులు పాల్గొన్నారు.