Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్విచవ్రాహనంపై చేజింగ్
- వాహనాలు ఆపి నిలువుదోపిడీ
నవతెలంగాణ-హసన్‌పర్తి
హసన్‌పర్తి పోలీసు స్టేషన్ పరిధిలో దారి దోపిడీ దొంగల స్వైర విహారంతో వాహనదారులు బెంబే లెత్తున్నారు. రాత్రి వేళలో వాహనాలపై చేజింగ్ చేస్తూ ప్రయాణికులను అడ్డుకొని బెదిరింపులకు పాల్పడుతూ నిలువుదోపిడీ చేస్తున్నట్లు బాదితులు ఆరోపిస్తున్నారు. తిరగబడిన వాహనదారులపై దాడికి పాల్పడడమే కాకుండా అడ్డు వచ్చిన వారిని హత్య చేసేందుకు వెన కాడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆది వారం ముగ్గురు అగంతకులు ద్విచక్రవాహనంపై చేజింగ్ చేసి అంబాల-పరకాల రోడ్డు మార్గమద్యలో దంపతుల వద్ద బంగారు నగలు, నగదు దోపిడి చేయ గా అదే రోజు పరకాల నుంచి హన్మకొండకు వస్తున్న మరో ద్విచక్ర వాహనదారుడిని చేజింగ్ చేసి రూ.1400లు, సెల్‌ఫోన్ దోపిడిచేసినట్లు బాదితుడు హసన్‌పర్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. బాధితుడి కథనం ప్రకారం పరకాలకు చెందిన జాలి గపు రవి హన్మ కొండలో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో సొంతగ్రామం పరకాలలోని తన తల్లిదండ్రులను కలిసి రాత్రి హన్మకొండకు తిరిగి వస్తున్నాడు. నాగా రం శివారు ప్రాంతంలోని పరకాల-అంబాల రోడ్డుపై ఎదురుగా వస్తున్న త్రిబుల్ రైడర్ ద్విచక్రవాహనం రవి ద్విచక్రవాహనాన్ని అడ్డుకున్నారు. తప్పించుకొని తిరిగి వచ్చే క్రమంలో కొంతదూరం వెంబడించి ద్విచక్ర వాహనాన్ని నిలిపివేసి బెదిరించి తన వద్ద ఉన్న రూ.1400 నగదుతో పాటు సెల్‌ఫోన్ లాక్కున్నట్లు తెలిపారు. అదే రోజు రాత్రి హసన్‌పర్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా అంతకు ముందే తమ బంగారు ఆభరణాలతో పాటు నగదు దోపిడీ చేసినట్లు దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమా చారం. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా బాదితులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
భయాందోళనలో వాహనదారులు
అంబాల-పరకాల రోడ్డులో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దారి దోపిడీకి పాల్పడుతున్న ఘట నలతో వాహనదారులు భయాందోళనలకు గురవు తు న్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోగా వెలుగులోకి రాకపోవడంపై పలు అను మానాలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి వేళలో అంబాల- పరకాల రోడ్డులో ప్రయాణం చేయాలంటే ద్వి చక్ర వాహనదారులు, ప్రయాణికులు భయాం దోళనకు గురవుతున్నారు. గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పటికీ బాధితులు అభద్రతాబావానికి లోనై పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్న ఆరోపణలు న్నాయి. యేడాది క్రితం పెంబర్తికి చెందిన ఓ వ్యక్తి ఆర్డీ కళాశాల ఎదుట హత్యకు గురికావడం వెనక దారిదోపిడీ దారుల పనేనన్న అనుమానాలు సైతం వినిపి స్తున్నాయి. పోలీసులు అప్రమత్తమై దారి దోపి డీకి పాల్పడుతున్న మూఠాపై నిఘాను ఉదృతం చేసి ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పిం చాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.
భైరాన్‌పల్లి వద్ద దారి దోపిడీ
మండలంలోని బైరాన్‌పల్లి శివారులో సోమ వారం తెల్లవారు జామున కొంత మంది గుర్తు తెలియని వ్యక్తు లు దారిదోపిడీకి పాల్పడినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు తెలిపారు. మల్లారెడ్డిపల్లికి చెందిన బోల్ల సాంబశివుడు కూరగాయల వ్యాపారం చేసు కుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ప్రతి రోజు వరంగల్ కూరగా యల మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తెచ్చుకొని ఇంటి వద్దే అమ్ముకునేవాడు. ఈ క్రమంలో సోమవారం తెల్ల ్లవారు జామున బైక్‌పై వరంగల్ కూర గాయల మార్కెట్‌కు వెళుతుండగా మార్గ మద్యలో బైరాన్‌పల్లి శివారు ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవా హనంపై ఎదు రుగా వచ్చి సాంబశివుడుపై దాడి చేసి మెడలో రెండు తులాల బంగారు గొలుసు, సెల్‌ఫోన్, రూ.3వేల నగదు దోచుకున్నట్లు తెలిపారు. ద్విచక్రవాహనం పెట్రోల్పైపు తొలగించి సిద్దాపూర్ వైపు పారి పోయి నట్లు తెలిపాడు. బాదితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.