Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పని చేయని సర్వర్
- రెండు రోజులుగా ఇదే పరిస్థితి
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-నయీంనగర్
సర్వర్ పని చేయక పోవడంతో పలు రేషన్ షాపులలో బియ్యం పంపిణీ ఆగిపోయి కార్డుదారులు ఎండలో ఇబ్బందులు పడ్డారు. రెండు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని కార్డు దారులు అవేదన వ్యక్తం చేస్తు న్నారు. ప్రతి నెలలో నాలుగైదు రోజులు ఈ విధమైన అంతరాయంతో కార్డు దారులు తీవ్రమైన అసౌకర్యం వల్ల పని దినాలు కోల్పోవలసి వస్తుందని వాపోతున్నారు. వినియోగదారుల రక్షణ సమితి ఆహారం కమిటీ సభ్యులు తేరాల యుగంధర్, కె. రాజేందర్. గోపాల్ పూర్లో ఉన్న పలు రేషన్ షాపు లను సందర్శించారు. 12 గంటల వరకు కూడా సర్వర్ పని చేయకపోవడం వల్ల రేషన్ కార్డు దారులు బియ్యం పొందలేక ఎండలో వరుసగా నిలబడలేక సంచు లను వరుసక్రమంలో పెట్టి నీడలో వేచి చూస్తున్నారని వారు వాపో యారు. మూడు రోజులుగా సర్వర్ అంతరాయంతో రేషన్ షాపుల చుట్టూ తిరుగుతున్న కార్డుదారులు ఎప్పుడూ సర్వర్ పని చేస్తుందో తెలియని అయో మయంలో రేషన్ డీలర్లు లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేసి కార్డుదారులకు వెంటనే బియ్యం పంపిణీకి ఏర్పాటు చేయాలని ఓరుగల్లు వినియోగదారుల రక్షణ సమితి ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ మారుమూల ప్రాంతాలలో సర్వర్ అంత రాయం వలన కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా కలెక్టర్ పౌరసరఫరాల శాఖ అధికారిణి వెంటనే జోక్యం కలగజేసుకుని సరఫరాను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.