Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు రాములు
- ఉచిత విద్యుత్ జీఓ పట్ల హర్షం
నవతెలంగాణ-తాడ్వాయి
సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం సెలూన్లకు నెలకు 250 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేయడానికి జీఓ జారీ చేసిందని నాయీబ్రాహ్మణ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మద్దూరి రాములు, మండల ప్రధాన కార్యదర్శి రాజు తెలిపారు. ప్రభుత్వం జీఓ విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో సెలూన్లలో సోమవారం జీఓ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాములు, రాజు మాట్లాడారు. కులవత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న నాయీబ్రాహ్మణులకు లబ్ధి చేకూర్చేలా సీఎం కేసీఆర్ జీఓ విడుదల చేశారంటూ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు లంజపెల్లి నాగార్జున్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.