Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్ని ప్రమాద బాధితులకు సరుకులు పంపిణీ
నవతెలంగాణ-తాడ్వాయి
అభయహస్తం ఫౌండేషన్ మండలంలోని లింగాల గ్రామ పంచాయతీలో అగ్ని ప్రమాదంలో ఇండ్లు కాలిపోయిన బాధితులకు ఆపన్నహస్తం అందించింది. కొద్ది రోజుల క్రితం అగ్ని ప్రమాదంలో ఇండ్లు కాలిపోయిన చాపల పెంటమ్మ, చాపల సుధాకర్, చాపల కాంతారావు, చాపల యాదయ్య కుటుంబాలను అభయహస్తం ఫౌండేషన్ టీమ్ (నిట్-2011 ఎంబీఏ పూర్వ విద్యార్థుల సంస్థ) ఆదివారం పరామర్శించింది. బాధిత కుటుంబాలకు 25 కిలోలు చొప్పున బియ్యంతోపాటు వారం రోజులకు సరిపడ కూరగాయలు, పప్పు, ఉప్పు, నూనె, పసుపు, కారం, తదితరాలు అందించారు. అనంతరం ఫౌండేషన్ జిల్లా కార్యదర్శి నిఖిల్, జిల్లా కోఆర్డినేటర్ శివ మాట్లాడారు. అగ్ని ప్రమాదంలో నిరుపేదల ఇండ్లు కాలిపోవడం బాధాకరమన్నారు. బాధితులను ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని కోరారు. యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు ముందుకు రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యుడు రఘు, బాధిత కుటుంబీకులు శాపాలు కృష్ణయ్య, సుధాకర్, కాంతారావు, పెండకట్ల పోతరాజు, తదితరులు పాల్గొన్నారు