Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాయీబాహ్మణ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్
నవతెలంగాణ-తొర్రూరు
సెలూన్లకు నెలకు 250 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందించడానికి నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేయడం అభినందనీయమని నాయీబ్రాహ్మణ సేవా సంఘం మండల అధ్యక్షుడు ఎనగందుల శ్రీనివాస్ అన్నారు. ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, మంత్రి దయాకర్‌రావు చిత్రపటాలకు సోమవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల నాయీబ్రాహ్మణులకు లబ్ది చేకూరనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయిబ్రాహ్మణుల అభివద్ధి కోసం ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయడంతోపాటు వృత్తిదారులకు రుణాలిప్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి నిమ్మకంటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కాదునూరు భిక్షపతి, పట్టణ అధ్యక్షుడు లింగాల శంకర్, డివిజన్ అధ్యక్షుడు గడ్డల మల్లయ్య, నాయకులు, అశోక్, సతీష్, వెంకన్న, గోపీ, రమేష్, సంతోష్, భిక్షపతి, హన్మంతు, శంకర్, శోభన్, యాకయ్య, సురేష్, ఏకాంబరం, తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడ : మండల కేంద్రంలో నాయీబ్రాహ్మణ సేవాసంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షుడు కొలిపాక సదానందం మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం నాయకులు యాదగిరి కిరణ్‌కుమార్, నాగబెల్లి శోభన్, జంపాల మురళీ, వివేక్, సదానందం, హరీష్, కష్ణ, రాము, తదితరులు పాల్గొన్నారు.